బెంగళూరు, జనవరి 14: కర్ణాటకకు చెందిన బీజేపీ ఎంపీ అనంత్‌కుమార్ హెగ్డే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఉత్తర కన్నడలోని భత్కల్ మసీదును కూల్చివేస్తామని అన్నారు.
శనివారం ఆయన మాట్లాడుతూ ‘అయోధ్యలోని బాబ్రీ మసీదును ఎలాగైతే కూల్చివేశామో ఉత్తర కన్నడలోని భత్కల్ మసీదును అలాగే కూల్చివేస్తాం. ఇది వందశాతం కచ్చితంగా జరుగుతుంది. ఇది నా నిర్ణయం కాదు.. హిందూ సమాజం నిర్ణయం’ అని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన పోలీసులు కేసు నమోదు చేశారు.