శ్రీనగర్: భారత్ మాతా కీ జై అంటూ జమ్మూకశ్మీర్ అసెంబ్లీ(Jammu & Kashmir Assembly)లో బీజేపీ ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు. ఆర్టికల్ 370ని పునరుద్దరించాలని కుప్వారాకు చెందిన పీడీపీ ఎమ్మెల్యే ఓ బ్యానర్‌ను ప్రదర్శించారు. దీంతో అసెంబ్లీలో ఒక్కసారిగా నినాదాలు మారుమోగాయి. స్పీకర్ అబ్దుల్ రహీమ్ రాథర్ ఆదేశాల మేరకు.. వెల్‌లోకి దూసుకువచ్చిన బీజేపీ ఎమ్మెల్యేలను మార్షల్స్ బయటకు లాక్కెళ్లారు. గురువారం కూడా అసెంబ్లీలో ఎమ్మెల్యేలు పరస్పరం దాడులు చేసుకున్నారు. ఆర్టికల్ 370 పునరుద్దరణకు కేంద్రం చర్చలు జరపాలంటూ బుధవారం అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టి, ఉద్రిక్తతల మధ్య ఆమోదించారు. దాన్ని బీజేపీ ఎమ్మెల్యేలు వ్యతిరేకించారు.
#WATCH | Srinagar | By orders of the J&K Assembly Speaker Abdul Rahim Rather, BJP MLAs entering the well of the House marshalled out pic.twitter.com/yHbRS1VEsw
— ANI (@ANI) November 8, 2024
ఇక ఇవాళ కూడా జమ్మూకశ్మీర్ అసెంబ్లీలో మరో సారి ఉద్రిక్తత ఏర్పడింది. వరుసగా రెండో రోజు బీజేపీ, ఎన్సీ ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం జరిగింది. ఆర్టికల్ 370ని పునరుద్దరించాలని ఇంజినీర్ రషీద్ సోదరుడు, అవామీ ఇతెహద్ పార్టీ ఎమ్మెల్యే ఖుర్షీద్ అహ్మద్ షేక్ గురువారం బ్యానర్‌ను ప్రదర్శించిన విషయం తెలిసిందే. అయితే అసెంబ్లీ సమావేశాలను అడ్డుకుంటున్న ఖుర్షీద్‌ను ఇవాళ మార్షల్స్ బయటకు ఈడ్చుకెళ్లారు. బెంచ్‌ల మధ్య నినాదాలు చేస్తున్న ఖుర్షీద్‌ను అయిదారు మంది మార్షల్స్ బలవంతంగా లాక్కెళ్లారు.