BJP MLA : బీజేపీకి చెందిన సీనియర్ నాయకుడు, ప్రస్తుత ఎమ్మెల్యే, కర్ణాటక విద్యాశాఖ మాజీ మంత్రి సురేష్ కుమార్ (Suresh Kumar) మంగళవారం ట్రాఫిక్ పోలీస్ (Traffic police) అవతారం ఎత్తారు. బెంగళూరు (Bengalore) సిటీలోని రాజాజీనగర్ (Rajaji Nagar) ఏరియాలోగల భాష్యం సర్కిల్లో ఆయన ట్రాఫిక్ విధులు నిర్వహించారు. ఈ సందర్భంగా వాహనదారులకు ట్రాఫిక్ రూల్స్‌ను పాటించాల్సిన ఆవశ్యకతను గురించి వివరించారు.
ట్రాఫిక్ రూల్స్‌ను పాటించడం ప్రతి పౌరుడి ప్రాథమిక విధి అని సురేష్ కుమార్ అన్నారు. ట్రాఫిక్ జామ్‌ను తగ్గించడంలో ప్రతి ఒక్కరూ తమ వంతు పాత్ర పోషించాలని సూచించారు. నగరంలో ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు బెంగళూరు పోలీసులు చేపట్టిన ‘ట్రాఫిక్ కాప్ ఫర్ ఎ డేస కార్యక్రమంలో భాగంగా సురేష్ కుమార్ ఇవాళ తన వంతుగా ట్రాఫిక్ పోలీస్ విధులు నిర్వహించారు.
ఇవాళ ట్రాఫిక్ పోలీస్‌గా విధులు నిర్వహించడం ద్వారా తాను అద్భుతమైన అనుభూతిని పొందానని సురేష్ కుమార్ చెప్పారు. బెంగళూరు పోలీసులు చేపట్టిన ఈ కార్యక్రమం స్వాగతించదగినదని అన్నారు. రద్దీ వేళలో ట్రాఫిక్‌ను నియంత్రించిన ఈ అనుభవాన్ని తాను మర్చిపోలేనని చెప్పారు. ఈ మేరకు ఆయన ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్న ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.