బెంగళూరు: నియోజకవర్గంలో జోరుగా వానలు కురుస్తున్నాయి. చాలా ప్రాంతాలను వరద ముంచెత్తింది. ఆపదలో ఉన్న ప్రజలను ఆదుకోవాల్సిన ఎమ్మెల్యే గోవాలో ఎంజాయ్ చేస్తున్నాడు. తనతోపాటు జిల్లాలోని ప్రజాప్రతినిధులను కూడా తీసుకెళ్లి సముద్ర తీరంలో సేదతీరాడు. ఓట్లేసిన ప్రజలు భారీ వానలతో ఇబ్బందిపడుతుంటే తానుమాత్రం స్విమ్మింగ్‌పూల్‌లో సరదాగా గడుపుతూ ఫొటోలకు పోజులచ్చాడు కర్ణాటకలోని బాగల్కోట్ జిల్లా తెర్దాల్ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే సిద్దు సవడి (Siddu Savadi).
ఉత్తర కర్ణాటకలో కృష్ణా, తుంగభద్ర నది పరివాహక ప్రాంతాలను వానలు ముంచెత్తాయి. ఆయా జిల్లాలకు వరద ముప్పు పొంచి ఉన్నదని ఈనెల 8న ప్రభుత్వం హెచ్చరికలు జారీచేసింది. అందులో బాగల్కోట్ జిల్లా కూడా ఉన్నది. జిల్లా వ్యాప్తంగా జోరుగా వానలు పడుతున్నాయి. అయితే అదే సమయంలో తెర్దాల్ ఎమ్మెల్యే సిద్దు.. గోవాలో విహారయాత్రకు వెళ్లారు. తనతోపాటు జిల్లాలోని స్థానిక సంస్థల ప్రజాప్రనిధులను కూడా అక్కడికి తీసెకెళ్లారు. ఓ రిసార్టులోని స్విమ్మింగ్ పూల్‌లో వారితో జలకాలాటలలో మునిగిపోయారు. సముద్రం ఒడున కూర్చుని బీచ్ అందాలను ఫొటోలకు పోజులిచ్చారు
జనాలు వానలతో ఇబ్బందులు పడుతున్నవేళ ఎమ్మెల్యే సరదాగా గోవా ట్రిప్‌ను ఎంజాయ్ చేస్తున్నారని ఆరోపించింది. గోవాలో ఎమ్మెల్యే దిగిన ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసింది. దీంతో ప్రతిపక్ష కాంగ్రెస్ ఆరోపణలను ఎమ్మెల్యే సిద్దు ఖండించారు. కావాలనే తనపై దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. తాను గోవాలో ఒక్కటే పూట ఉన్నాని, ఉదయాన్నే స్నానం చేయడం తప్పా అని ప్రశ్నించారు. అయిన తన నియోజకవర్గంలో వానలు పడలేదని చెప్పారు.