చంబా: హిమాచల్ ప్రదేశ్‌లోని చంబా బీజేపీ ఎమ్మెల్యే హన్స్ రాజ్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. తనకు 16 ఏండ్ల వయస్సు ఉన్నప్పటి నుంచి హన్స్ రాజ్ లైంగికంగా వేధించారని ఓ మహిళ శుక్రవారం చంబా మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ఈ కేసు నమోదు జరిగింది. ఇదే విషయాన్ని ఆమె గతవారం ఫేస్బుక్ లైవ్‌లో తెలిపారు.
ఎమ్మెల్యే, ఆయన అనుచరులు చేసిన వేధింపులకు సంబంధించి తన వద్ద ఆధారాలున్నాయన్నారు. దీనిపై ఎమ్మెల్యే స్పందిస్తూ ఇది రాజకీయ ప్రేరేపిత చర్య అన్నారు.