BJP MLA | పాట్నా: బీహార్లో హింసను ప్రేరేపించేలా బీజేపీ ఎమ్మెల్యే చేసిన ప్రసంగం, ఆయన చర్యలు వివాదాస్పదంగా మారాయి. అమ్మాయిలను తాకిన దుర్మార్గుల చేతులను నరకాలంటూ పిలుపునిచ్చన ఎమ్మెల్యే మిథిలేశ్ కుమార్ విద్యార్థినులకు కత్తులను పంపిణీ చేశారు.
విజయదశమి వేడుకల సందర్భంగా సీతామర్హి జిల్లాలో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఎవరైనా దుర్మార్గులు మన సోదరీమణులను తాకడానికి ధైర్యం చేస్తే వారి చేతులను ఈ కత్తితో నరకాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.