చెన్నై: ఉత్తర భారత రాష్ట్రాలకు చెందిన బీజేపీ నేతలు నకిలీ వార్తలు వ్యాప్తి చేస్తున్నారని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ (MK Stalin) ఆరోపించారు. తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ‘రాజకీయ ప్రేరేపిత కుట్ర’ జరుగుతోందని ఆయన మండిపడ్డారు. బీహార్‌కు చెందిన వలస కార్మికులపై దాడి జరిగినట్లుగా కొన్ని వీడియో క్లిప్‌లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో డీఎంకే చీఫ్, సీఎం స్టాలిన్ దీనిపై గురువారం స్పందించారు. భారతదేశం అంతటా ఉన్న ప్రజలకు తమ రాష్ట్రం నిలయమని తెలిపారు. ‘తమిళులు సోదరభావాన్ని ప్రేమిస్తారు. ఇక్కడి ఉత్తరాది రాష్ట్ర సోదరులకు ఇది బాగా తెలుసు’ అన ఆయన అన్నారు. కొంతమంది వ్యక్తులు నకిలీ వీడియోలు సృష్టించి తప్పుడు వార్తలు వ్యాప్తి చేశారని సీఎం స్టాలిన్ విమర్శించారు. ‘ఉత్తర భారత రాష్ట్రాలకు చెందిన బీజేపీ సభ్యులు దురుద్దేశంతో ఇలా చేశారు. బీజేపీకి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో ఐక్య కూటమి అవసరమని నేను మాట్లాడిన మరుసటి రోజే ఇలా జరిగింది. దీనిని గమనిస్తే ఆ కుట్ర మీకు అర్థమవుతుంది’ అని అన్నారు.
కాగా, బీహార్ వలస కార్మికులపై దాడికి సంబంధించిన నకిలీ వీడియోలపై డీజీపీతో దర్యాప్తు చేయించినట్లు సీఎం స్టాలిన్ తెలిపారు. తమిళనాడులో అలాంటి సంఘటనలు జరుగలేదన్నారు. బీహార్ సీఎం నితీశ్ కుమార్‌తో కూడా ఈ అంశంపై తాను మాట్లాడినట్లు చెప్పారు. అలాగే బీహార్ ప్రతినిధులు కూడా తమిళనాడును సందర్శించి పూర్తి సంతృప్తితో తిరిగి వెళ్లినట్లు వెల్లడించారు.
మరోవైపు తమిళనాడులో వలస కార్మికులు నివాసం ఉండే ప్రాంతాలను సీఎం స్టాలిన్ మంగళవారం సందర్శించారు. ఇతర రాష్ట్రాలకు చెందిన నివాసితుల భద్రతకు భరోసా ఇచ్చారు. డీఎంకే ఎంపీ టీఆర్ బాలు కూడా సీఎం నితీశ్ కుమార్‌ను పాట్నాలో కలిశారు. బీహార్‌కు చెందిన వలస కార్మికులకు భద్రత కల్పిస్తామని తెలిపారు. సీఎం స్టాలిన్ కూడా నితీష్ కుమార్‌తో ఫోన్లో మాట్లాడారు.
మార్చి 1న నాలుగు ఫేక్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. బీహార్‌కు చెందిన వలస కార్మికులను తమిళనాడులో కొట్టినట్లు ఆ వీడియోలో ఆరోపించారు. దీనిపై తమిళనాడు పోలీసులు వెంటనే స్పందించారు. బీహార్ కార్మికులు నివాసం ఉండే ప్రాంతాలకు వెళ్లి ఆరా తీశారు. దీంతో ఫేక్ వీడియోలుగా నిర్ధారణ అయ్యింది. ఈ నేపథ్యంలో తమిళనాడు బీజేపీ చీఫ్ కే అన్నామలై, ఆ పార్టీ ట్విట్టర్ హ్యాండిల్, ఢిల్లీ హైకోర్టు నుంచి ముందస్తు బెయిల్ పొందిన ఉత్తర ప్రదేశ్‌కు చెందిన బీజేపీ నేత ప్రశాంత్ ఉమ్రావ్తో సహా 12 కేసులు నమోదయ్యాయి.
బీహార్ పోలీసులు కూడా దీనిపై అప్రమత్తమయ్యారు. ఆ రాష్ట్ర జర్నలిస్ట్ పోస్ట్ చేసిన ఫేక్ వీడియో క్లిప్‌పై స్పందించారు. ఒకరిని అరెస్ట్ చేయడంతోపాటు మరి కొందరిపై కేసు నమోదు చేశారు.
One manoj Yadav of Jharkhand and his friends, who are migrant workers residing at maraimalai Nagar area, created a video as if they are beaten up by Tamil people, and facing lot of problems in their work place (1/3) pic.twitter.com/PSajzsEnvj
— Tamil Nadu Police (@tnpoliceoffl) March 7, 2023
You can’t cheat everyone, every time. Please see this video. This incident, not happened in Tamil Nadu. It is purely a scripted one. Please verify the fact and tweet. Stern legal action follows – Tamil Nadu Police. https://t.co/r7bX5mrwJf pic.twitter.com/ZgMEQGse8h
— Tamil Nadu Police (@tnpoliceoffl) March 8, 2023