లక్నో: రక్త దానం చేసినట్లు బీజేపీ మేయర్ నటించారు. (BJP Mayor fakes blood donation) శిబిరంలోని బెడ్‌పై పడుకున్న ఆయన కేవలం ఫొటోలకు ఈ మేరకు పోజు ఇచ్చారు. రక్తం తీసుకునేందుకు వైద్య సిబ్బంది ప్రయత్నించగా వెంటనే బెడ్ పైనుంచి లేచి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో ఆ బీజేపీ నేతపై విమర్శలు వెల్లువెత్తాయి. ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో ఈ సంఘటన జరిగింది. సెప్టెంబర్ 17న ప్రధాని మోదీ పుట్టిన రోజు సందర్భంగా స్థానిక బీజేపీ కార్యాలయంలో రక్త దాన శిబిరం నిర్వహించారు.
కాగా, బీజేపీ సీనియర్ నేత, మొరాదాబాద్ మేయర్ వినోద్ అగర్వాల్ అక్కడకు వచ్చారు. ఒక బెడ్‌పై పడుకున్న ఆయన రక్త దానం చేస్తున్నట్లు నటించారు. ఈ మేరకు ఫొటోలకు పోజులిచ్చారు. ఆ తర్వాత
బీపీ పరీక్షించేందుకు డాక్టర్ సిద్ధం కాగా ఇది అవసరం లేదని అన్నారు. రక్త సేకరణ కోసం వైద్య సిబ్బంది ఒకరు సూదిని బయటకు తీస్తుండగా వినోద్ అగర్వాల్ అకస్మాత్తుగా బెడ్ నుంచి పైకి లేచారు. వెంటనే అక్కడి నుంచి బయటకు వెళ్లిపోయారు.
మరోవైపు ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో రక్త దానం చేస్తున్నట్లుగా మేయర్ వినోద్ అగర్వాల్ నటించడంపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఆయన స్పందించారు. తన పరువు తీసేందుకు ప్రత్యర్థులు కుట్ర పన్నారని ఆరోపించారు. ‘సెప్టెంబర్ 17న బీజేపీ యువజన విభాగం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించాం. రక్త దానం చేయాలన్న ఉద్దేశంతో అక్కడకు వెళ్లా. రక్తం తీసుకునే ముందు నాకేదైనా జబ్బు ఉందా అని డాక్టర్ అడిగారు. మధుమేహం ఉందని, రెండేళ్ల క్రితం గుండె సమస్య ఉన్నదని చెప్పా. నేను రక్త దానం చేయకూడదని డాక్టర్ అన్నారు. దీంతో వెంటనే పైకి లేచా’ అని అన్నారు.
Uttarpradesh, Moradabad
BJP mayor Vinod Agarwal did a fake for blood donation on the occasion of the Birthday of PM Narendra Modi.
I am remembering that signature acting if you know. pic.twitter.com/6QhDaNmo0B— Mr.Haque (@faizulhaque95) September 20, 2024