PM Modi | మొరాదాబాద్: ప్రధాని మోదీ పుట్టిన రోజు సందర్భంగా ఈ నెల 17న నిర్వహించిన రక్తదాన శిబిరం అభాసుపాలైంది. మొరాదాబాద్‌లోని బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన ఈ శిబిరంలో ఆ పార్టీ సీనియర్ నేత, స్థానిక మేయర్ వినోద్ అగర్వాల్ రక్తదానం చేయకపోయినప్పటికీ చేసినట్టుగా కెమెరా ముందు నటించి అందరినీ నమ్మించే ప్రయత్నం చేశాడు.
ఆయన రక్తపోటును పరిశీలించేందుకు ఓ ఆరోగ్య సంరక్షణ కార్యకర్త సిద్ధమవడంతో ఆ ప్రక్రియను కొనసాగించవద్దని ఆయన వైద్యుడిని కోరారు. ఆ తర్వాత ఆ వైద్యుడు సూదిని బయటకు తీయగానే అగర్వాల్ మంచం దిగి ఆ గది నుంచి వెళ్లిపోయారు. కెమెరా కోసం నకిలీ రక్తదానం చేశారంటూ పలువురు ఆయనపై విమర్శలు గుప్పించారు.