-జిన్నా వివాదంపై బీజేపీకి సూచన
న్యూఢిల్లీ, నవంబర్ 6: మహమ్మద్ అలీ జిన్నాను పొగుడుతూ తాను చేసిన వ్యాఖ్యలను సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ సమర్థించుకున్నారు. జిన్నాను మహాత్మా గాంధీ, సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్‌తో పోల్చిన అఖిలేశ్ బీజేపీ నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. అఖిలేశ్‌ది ‘తాలిబన్ మైండ్‌సెట్’ అని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ విమర్శించారు. దీనిపై మీడియా అడిగిన ఓ ప్రశ్నకు బదులిస్తూ ‘మళ్లీ పుస్తకాలు చదవండి’ అని విమర్శకులకు సూచించారు.