ఇటానగర్, జూన్ 13: అరుణాచల్ ప్రదేశ్ సీఎంగా బీజేపీ నాయకుడు పెమా ఖండూ గురువారం ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్ర సీఎంగా ఆయన పదవీ బాధ్యతలు చేపట్టడం వరుసగా ఇది మూడోసారి. 11 మంది మంత్రులతో ఏర్పాటుచేసిన రాష్ట్ర క్యాబినెట్లో దసాంగ్లు పుల్ ఏకైక మహిళా మంత్రిగా ఉన్నారు. ముగ్గురు సిట్టింగ్ మంత్రులకు తాజా క్యాబినెట్లో చోటుదక్కక పోవటం గమనార్హం.
రాజధాని ఇటానగర్‌లో రాష్ట్ర గవర్నర్ కేటీ పర్నాయక్ చేతులమీదుగా జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, అస్సాం, సిక్కిం సీఎంలు హిమంత బిశ్వశర్మ, ప్రేమ్‌సింగ్ తమాంగ్ తదితరులు హాజరయ్యారు. 60 అసెంబ్లీ స్థానాలున్న అరుణాచల్ ప్రదేశ్‌లో బీజేపీ 46 స్థానాల్ని కైవసం చేసుకుంది.