న్యూఢిల్లీ: పార్లమెంట్ సమావేశాలకు ముందు బీజేపీ నాయకురాలు, భోపాల్ ఎంపీ సాధ్వీ ప్రజ్ఞా ఠాకూర్ కరోనా బారిన పడ్డారు. కరోనా రిపోర్టు పాజిటివ్‌గా వచ్చిందని ఆమె ప్రకటించా రు . ప్రస్తుతం తాను డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నానని, గత రెండు రోజులుగా తనను కలిసినవారు జాగ్రత్తగా ఉండాలి, పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.
ఈరోజు నా కరోనా రిపోర్టుల్లో పాజిటివ్ వచ్చింది. ఇప్పుడు నేను డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నాను. గత రెండు రోజుల్లో నన్ను కలిసిన వారు జాగ్రత్తగా ఉండాలి. అవసరమైతే పరీక్షలు చేయించుకోండి. మీ అందరి ఆరోగ్యం గురించి దేవుడిని ప్రార్ధిస్తున్నాను అని సాధ్వీ ట్వీట్ చేశారు.
आज मेरी कोरोना रिपोर्ट पॉजिटिव आई है। मैं चिकित्सकों की देखरेख में हूं। 2 दिनों में जो भी मेरे संपर्क में आए हैं सभी से आग्रह है कि सचेत रहें और आवश्यकता पड़ने पर कोरोना टेस्ट भी करवा लें। हमें आपकी चिंता है। प्रभु से प्रार्थना है आप सभी स्वस्थ रहें।
— Sadhvi Pragya singh thakur (@SadhviPragya_MP) January 30, 2022
కాగా, గతేడాది కరోనా వైరస్ గురించి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. గో మూత్రం తాగితే కరోనా దరి చేరదని వ్యాఖ్యానించారు. గో పంచకం తాగడం వల్ల ఉపూరి తిత్తుల ఇన్ఫెక్షన్ నుంచి దూరంగా ఉండవచ్చని అన్నారు. తాను ఆ సమస్యను ఎదుర్కొన్నానని, గో మూత్రం తాగడంతో దానిని నుంచి బయటపడ్డానని చెప్పారు. కరోనా వైరస్‌కు ప్రత్యేకంగా ఎలాంటి మందులు వాడనని, తాను కరోనా బారిన పడేఅవకాశమే లేదన్నారు.