రాజకీయాలు మానేసి.. వంట చేస్కో!
మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్ ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలేపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇంటికెళ్లి వంట చేసుకోవాలంటూ అభ్యంతరకరంగా మాట్లాడారు. దీనిపై ఎన్సీపీ నేతలు మండిపడ్డారు. మధ్యప్రదేశ్ స్థానిక ఎన్నికల్లో ఓబీసీలకు కోటా కల్పిస్తూ ఇటీవల సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. దీన్ని ఉద్దేశిస్తూ సూలే ఓ కార్యక్రమంలో
ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలేపై బీజేపీ అధ్యక్షుడి అనుచిత వ్యాఖ్యలు
ముంబై, మే 26: మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్ ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలేపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇంటికెళ్లి వంట చేసుకోవాలంటూ అభ్యంతరకరంగా మాట్లాడారు. దీనిపై ఎన్సీపీ నేతలు మండిపడ్డారు. మధ్యప్రదేశ్ స్థానిక ఎన్నికల్లో ఓబీసీలకు కోటా కల్పిస్తూ ఇటీవల సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. దీన్ని ఉద్దేశిస్తూ సూలే ఓ కార్యక్రమంలో మాట్లాడారు. మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ ఢిల్లీలో కొందరు ముఖ్య వ్యక్తులను కలిశారని, ఇది జరిగిన రెండురోజులకే ఓబీసీ రిజర్వేషన్ వచ్చిందని వ్యాఖ్యానించారు.
దీనిపై చౌహాన్‌ను అడిగినా ఆయన నుంచి సమాధానం ఏమీ లేదన్నారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన పాటిల్ బుధవారం ఓ నిరసన కార్యక్రమంలో మాట్లాడుతూ.. ‘మీరు (సూలే) ఇంకా రాజకీయాల్లో ఎందుకు ఉన్నారు? ఇంటికెళ్లి వంట చేసుకోండి. ఢిల్లీకి వెళ్తారో.. శ్మశానానికి వెళ్తారో మాకు తెలియదు. మాకు ఓబీసీ కోటా కావాలి. లోక్‌సభ ఎంపీ అయిన మీకు సీఎం అపాయింట్మెంట్ కూడా ఎలా తీసుకోవాలో తెలియదా?’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తన సోదరిపై ఈ తరహా వ్యాఖ్యలు సరికాదని సూలే సోదరుడు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ అన్నారు. బీజేపీ స్త్రీద్వేషి పార్టీ అని సూలే భర్త సదానంద్ సూలే మండిపడ్డారు. కాగా.. సూలేను, స్త్రీలను అగౌరపర్చడం తన ఉద్దేశం కాదని, గ్రామీణ ప్రాంతాల్లో మాట్లాడే వ్యావహారిక భాషలో తాను మాట్లాడానే తప్ప మరో ఉద్దేశం లేదని పాటిల్ గురువారం చెప్పుకొచ్చారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- BJP leader
- cooking
- mocks
- NCP
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

