అధికార మదంతో కళ్లు మూసుకుపోతే మంచేదో చెడేదో కూడా కనిపించదు. మనిషిలోని రాక్షసుడు బయటకు వచ్చి ఇతరులను హింసిస్తూ సంతోషం పొందుతాడు. సరిగ్గా అదే పరిస్థితిలో ఉన్నారు బీజేపీ నేతలు. తాజాగా జార్ఖండ్లో వెలుగు చూసిన ఘటన గురించి తెలిస్తే.. ఎవరైనా బీజేపీ నేతలకు అధికార మదం ఎక్కిందనే అంటారు.
బీజేపీ మహిళా విభాగంలో నేషనల్ వర్కింగ్ కమిటీ సభ్యురాలిగా ఉన్న సీమా పాత్ర.. తన ఇంట్లో పని చేయడానికి వచ్చిన యువతికి నరకం చూపించింది. ఆమెను గదిలో బంధించి సరిగా భోజనం కూడా పెట్టలేదు. గది మొత్తం నాలుకతో శుభ్రం చేయించేది. అక్కడితో ఆగకుండా నేలపై మూత్రంపోసి ఆ యువతితో నాకించేది, ఆమె చేత మూత్రం తాగించేది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సుమతి (29) అనే యువతి పదేళ్ల క్రితం సీమా ఇంట్లో పనికి చేరింది. సీమ వాళ్ల కుమార్తె ఢిల్లీ వెళ్తుంటే, ఆమెను తోడు పంపించారు. నాలుగేళ్ల క్రితం తిరిగొచ్చిన తర్వాత సుమతికి నరకం చూపించడం మొదలు పెట్టింది సీమ. సుమతి అక్క, బావలకు ఆమె పరిస్థితి తెలిసినా కూడా ఆమెను ఇంటికి తీసుకెళ్లడానికి నిరాకరించారు. సుమతి అనుభవిస్తున్న నరకం గురించి తెలుకున్న సీమ కుమారుడు ఆయుష్మాన్.. తన స్నేహితుడికి ఈ విషయం చెప్పి, తనకు సాయం చేయాలని కోరాడు.
అతను పోలీసులకు సమాచారం అందించడంతో వాళ్లు సీమ ఇంటిపై రెయిడ్ చేసి సుమతిని రక్షించారు. కనీసం కూర్చోలేకపోతున్న ఆమెను ఆస్పత్రికి తరలించారు. చికిత్సతో నెమ్మదిగా కోలుకుంటున్న ఆమె తను అనుభవించిన నరకాన్ని వివరించింది. తనకు ఆహారం ఇచ్చేవారు కాదని, బలవంతంగా మూత్రం తాగించేవారని సుమతి చెప్పింది.
ఐరన్ రాడ్డు, బెల్టులతో చావబాదేదని, హాట్ ప్యాన్తో వాతలు పెట్టేదని వాపోయింది. పళ్లు ఊడిపోయేలా కొట్టేదని కన్నీరు పెట్టుకుంది. ఈ విషయం వెలుగులోకి రావడంతో ప్రతిపక్ష పార్టీలు బీజేపీపై దుమ్మెత్తిపోస్తున్నాయి. బీజేపీ నాయకులకు అధికారంతో కళ్లు నెత్తికెక్కాయని, అందుకే ఇలా ప్రవర్తిస్తున్నారని మండిపడుతున్నారు.
This is how BJP National Working Committee leader Seema Patra tortured a tribal girl for 8 years …#BJPseBeti_Ko_Bachaao@KTRTRS pic.twitter.com/oMBkxe9n4d
— krishanKTRS (@krishanKTRS) August 30, 2022