జర్నలిస్ట్‌పై బీజేపీ నేత మండిపాటు
భోపాల్, ఆగస్టు 20: దేశంలో చమురు ధరలు అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో మధ్యప్రదేశ్‌కి చెందిన బీజేపీ నేత రాంరతన్ పాయల్‌ను ఇదే అంశంపై ఓ విలేకరి ప్రశ్నించాడు. అంతే.. ఆ ప్రశ్నకు చిర్రెత్తుకొచ్చిన ఆ నాయకుడు.. ‘తాలిబన్లు ఆక్రమించిన అఫ్గానిస్థాన్‌కు వెళ్లు. అక్కడ పెట్రోల్ చాలా చౌకగా రూ.50కే దొరుకుతుంది’ అంటూ మండిపడ్డారు. రాంరతన్ ప్రవర్తనపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అయితే, దేశంలో కరోనా థర్డ్‌వేవ్ ముంచుకురాబోతున్న ఈ క్లిష్ట సమయంలో చమురు గురించి అడగడంతోనే తాను ఈ వ్యాఖ్యలు చేశానని రాంరతన్ చెప్పుకొచ్చారు. మరోవైపు భారత్‌లో నివసించడానికి భయపడే మైనారిటీ ప్రజలు అఫ్గాన్‌కు వెళ్లొచ్చని, వాళ్లు వెళ్లినంత మాత్రాన దేశానికి వచ్చిన నష్టం ఏమీలేదని బీహార్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే హరిభూషణ్ ఠాకూర్ అన్నారు.