న్యూఢిల్లీ : పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్‌లోని కర్తార్‌పూర్ (Kartarpur) దర్బార్ సాహిబ్ గురుద్వారలో డ్యాన్స్ పార్టీకి సంబంధించిన వీడియో నెట్టింట వైరలవడం కలకలం రేపింది. గురుద్వారలో డ్యాన్స్ పార్టీ నిర్వహించడం ద్వారా కర్తార్‌పూర్ గురుద్వార నిర్వాహకులు సిక్కుల మనోభావాలను అగౌరవపరిచారని బీజేపీ నేత మంజీందర్ సింగ్ సిర్సా ఆరోపించారు. పార్టీకి హాజరైన వారిలో పలువురు మద్యం సేవించి మాంసం తిన్నారని వారిపై కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
ఈ ఘటనను తాను తీవ్రంగా ఖండిస్తున్నానని, గురుద్వారలో పార్టీ నిర్వాహకులను, పాల్గొన్నవారిపై కేసు నమోదు చేసి జైలుకు తరలించాలని పాకిస్తాన్ ప్రభుత్వాన్ని సిర్సా కోరారు. గురుద్వార దర్బార్ సాహిబ్ కాంప్లెక్స్‌లో పీఎంయూ కర్తార్‌పూర్ కారిడార్ సీఈవో సయ్యద్ అబు బాకర్ ఖురేషి ఈనెల 18న డ్యాన్స్ పార్టీ ఏర్పాటు చేశారు.
రాత్రి 8 గంటల నుంచి 11 గంటల వరకూ జరిగిన ఈ పార్టీలో నరోవల్ డిప్యూటీ కమిషనర్ మహ్మద్ షారుక్, నరోవల్ జిల్లా పోలీస్ అధికారి, గ్రాంతి గురుద్వారా కర్తార్‌పూర్ గియాని గోవింద్ సింగ్ సహా 80 మందికిపైగా హాజరయ్యారు. గురు నానక్ దేవ్ తుది శ్వాస విడిచిన పవిత్ర ప్రదేశంలో డ్యాన్స్ పార్టీ నిర్వహించడం పట్ల పలు సిక్కు సంఘాలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి. గురుద్వారలో డ్యాన్స్ పార్టీకి సంబంధించిన వీడియోలో నరోవల్ డిప్యూటీ కమిషనర్‌తో కలిసి సయ్యద్ అబు బాకర్ ఖురేషి ఓ పాటకు డ్యాన్స్ చేయడం కనిపించింది.
Read More :
Uttarakhand Tunnel: రంగంలోకి అంతర్జాతీయ టన్నెలింగ్ నిపుణుడు అర్నాల్డ్ డిక్స్