ముంబై: దేశంలో అత్యంత అవినీతి పార్టీ ఏదైనా ఉందంటే అది భారతీయ జనతాపార్టీ (BJP) యేనని నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (NCP) వర్కింగ్ ప్రెసిడెంట్, లోక్‌సభ సభ్యురాలు సుప్రియా సూలే విమర్శించారు. కుట్రలు చేసి ప్రత్యర్థి పార్టీల ప్రభుత్వాలను కూల్చడం, ప్రలోభాలకు గురిచేసి ప్రత్యర్థి పార్టీలను చీల్చడం బీజేపీకి అలవాటుగా మారిందని ఆమె ఆరోపించారు.
బీజేపీ అత్యంత అవినీతి పార్టీ అని కేవలం తాను మాత్రమే అనడంలేదని, దేశ ప్రజలే అంటున్నారని సుప్రియా సూలే వ్యాఖ్యానించారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి ప్రజలు బుద్ధి చెబుతారని అన్నారు. ఇక బీజేపీ నేతలు, అజిత్‌పవార్ వర్గం ఎన్సీపీ నేతలు శరద్ పవార్‌ను విమర్శించడంపై కూడా ఆమె స్పందించారు. తమను అగౌరవపర్చినా సహిస్తాంగానీ, నా తండ్రిని అగౌరవపరిస్తే మాత్రం తాము సహించబోమని సుప్రియా హెచ్చరించారు.
#WATCH | “Disrespect us, but not our father (Sharad Pawar). This fight is against the BJP government. BJP is the most corrupt party in the country,” says NCP Working President Supriya Sule, in Mumbai. pic.twitter.com/BxrUYpU6WI
— ANI (@ANI) July 5, 2023