భోపాల్ : మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో (Madhya Pradesh Poll Results) పాలక బీజేపీ అధికారం నిలబెట్టుకునే దిశగా ముందుకు సాగుతోంది. బీజేపీ, కాంగ్రెస్ మధ్య తీవ్ర పోటీ ఉంటుందనే అంచనాలకు విరుద్ధంగా కాషాయ పార్టీ మ్యాజిక్ ఫిగర్ సునాయాసంగా అధిగమించే దిశగా దూసుకుపోతోంది.
బీజేపీ ఏకంగా 160 స్ధానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండగా కాంగ్రెస్ 67 స్ధానాల్లో ముందంజలో ఉంది. 2018 ఫలితాలతో పోలిస్తే బీజేపీ 51 స్ధానాలను అదనంగా గెలుచుకోనుండగా కాంగ్రెస్ 47 స్ధానాలను కోల్పోనుంది. ఇక బీఎస్పీ మూడు స్ధానాల్లో రెండింటిని నిలబెట్టుకునే దిశగా ఆధిక్యంలో కొనసాగుతోంది.
ఇక సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ బుధ్ని స్ధానంలో ఆధిక్యంలో కొనసాగుతుండగా కాంగ్రెస్ అగ్ర నేత కమల్ నాధ్ చింద్వారాలో వెనుకంజలో ఉన్నారు. బీజేపీ డబుల్ ఇంజన్ సర్కార్కు అనుకూలంగా ప్రజలు తీర్పు ఇచ్చారని, భారీ మెజారిటీతో తాము అధికారం నిలుపుకుంటామని సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు.
Read More :
Mahua Moitra | ప్రశ్నకు నోటు కేసు.. టీఎంసీ ఎంపీపై వేటుకు కేంద్రం చర్యలు..!