డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లో బీజేపీ హ్యాట్రిక్ సాధించింది. రాష్ట్రంలోని ఐదు లోక్‌సభ స్థానాలను ఆ పార్టీ కైవసం చేసుకుంది. ఈ పర్వత ప్రాంత రాష్ట్రంలో 2014 లోక్‌సభ ఎన్నికల నుంచి 2017, 2022 అసెంబ్లీ ఎన్నికలు సహా ఇప్పటివరకు కాంగ్రెస్‌పై బీజేపీ పూర్తి ఆధిక్యాన్ని ప్రదర్శిస్తూ వస్తున్నది. బీజేపీకి ఈ ఎన్నికల్లో 56.8 శాతం ఓట్లు రాగా, కాంగ్రెస్‌కు 32.8 శాతం మాత్రమే దక్కాయి.
కేంద్ర సహాయ మంత్రి అజయ్ భట్ నైనిటాల్ ఉద్ధమ్ సింగ్ నగర్లో 3.34 లక్షల ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థిపై విజయం సాధించారు. అలాగే హరిద్వార్‌ను మాజీ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్ గెల్చుకున్నారు. దేశ ప్రజలు మరోసారి మోదీ నాయకత్వానికే మద్దతు తెలిపారని, అందుకే రాష్ట్రంలోని అన్ని సీట్లలో మరోసారి బీజేపీకే పట్టం కట్టారని స్టార్ క్యాంపెయినర్‌గా వ్యవహరించిన ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి పేర్కొన్నారు.