Akhilesh Yadav | న్యూఢిల్లీ, ఏప్రిల్ 20: ఉత్తరప్రదేశ్‌లో సీఎం యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని బీజేపీ సర్కార్‌పై సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను ప్రధానిగా ప్రమోట్ చేసేందుకు రాష్ట్రంలో ఇటీవల నిర్వహించిన మహా కుంభమేళాను రాజకీయ కుంభమేళాగా బీజేపీ వాడుకుందని విమర్శించారు.
సామాజిక విభజనను, సీఎం యోగి ఆదిత్యను ప్రోత్సహించడానికి చేసిన తతంగంగా ఆయన దీనిని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు రెండు మతాల మధ్య చిచ్చును రేపుతున్నదని బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే విమర్శలపై అఖిలేశ్ యాదవ్ స్పందిస్తూ పై వ్యాఖ్యలు చేశారు. ‘దేశ ప్రధాని పదవికి సీఎం యోగి పేరును తీసుకొచ్చేందుకు బీజేపీ మహా కుంభమేళాను వాడుకుంది. కులం పేరుతోవిభజన తీసుకురావటం బీజేపీ ప్రణాళికాబద్ధమైన కార్యక్రమం’ అని విమర్శించారు.