లక్నో, జనవరి 23: దేశాన్ని ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా పూర్తిగా దిగజార్చి, అన్నివిధాల వెనుకబడిపోయేలా చేసిన మోదీ ప్రభుత్వాన్ని 2024 ఎన్నికల్లో ప్రజలు సాగనంపడం ఖాయమని సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ పేర్కొన్నారు. బీజేపీ సర్కారు బడాబాబులకే మేలు చేకూర్చిందని, ప్రజలకు మాత్రం విద్వేషం, ద్రవ్యోల్బణాన్ని పంచిందని మండిపడ్డారు. దేశంలో ఆకలి, నిరుద్యోగం, పేదరికం వంటి ఎన్నో సమస్యలు ప్రజలను పట్టిపీడిస్తున్నాయని, కానీ మోదీ ప్రభుత్వానికి ఇవేమీ పట్టడం లేదని విమర్శించారు. బీజేపీ ప్రభుత్వం ధనవంతులను మరింత సంపన్నులుగా, పేదలను మరింత బీదవారిగా మార్చిందన్నారు.