సిమ్లా, సెప్టెంబర్ 24: రైతుల పోరాటంతో రద్దయిన మూడు వ్యవసాయ చట్టాలను మళ్లీ చేయాలని బీజేపీ ఎంపీ, నటి కంగనా రనౌత్ పేర్కొన్నారు. ‘నా ప్రకటన వివాదాస్పదం అవుతుందని నాకు తెలుసు. అయినా మూడు వ్యవసాయ చట్టాలను మళ్లీ తీసుకురావాలి. వీటి కోసం రైతులే డిమాండ్ చేయాలి.’ అని ఆమె వ్యాఖ్యానించారు. ఈ మూడు చట్టాలు రైతులకు ఎంతగానో మేలు చేస్తాయని, కానీ కొన్ని రాష్ర్టాల్లో రైతు సంఘాల ఆందోళనల వల్ల ప్రభుత్వం రద్దు చేయాల్సి వచ్చిందని ఆమె పేర్కొన్నారు. రైతుల మేలు కోసమే ఈ చట్టాలను మళ్లీ తీసుకురావాలని కోరుకుంటున్నానని కంగనా పేర్కొన్నారు.