న్యూఢిల్లీ: అరుణాచల్ ప్రదేశ్ (Arunachal Pradesh), సిక్కిం (Sikkim) అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతున్నది. ఎన్నికల షెడ్యూల్ ప్రకారం ఈ నెల 4న కౌంటింగ్ జరగాల్సి ఉన్నప్పటికీ.. రెండు రాష్ట్రాల అసెంబ్లీల గడువు నేటితో ముగియనున్నది. దీంతో ఆదివారం ఉదయం ఓట్ల లెక్కింపు ప్రారంభించారు. అరుణాచల్‌లో 60 స్థానాలు ఉండగా, సిక్కింలో 32 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. వీటన్నింటికీ ఏప్రిల్ 19న ఒకే దశలో పోలింగ్ జరిగింది.
కాగా, అరుణాచల్‌లో అధికార బీజేపీ మరోసారి దూసుకుపోతున్నది. ఓట్ల లెక్కింపు ప్రారంభమైన గంటలోనే స్పష్టమైన మెజార్టీతో దూసుకెళ్తున్నది. ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్‌ను దాటేసిన కమలం పార్టీ 10 స్థానాల్లో విజయం సాధించింది. మరో 27 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నది. అరుణాచల్‌లో ముఖ్యమంత్రి పీఠాన్ని సొంతం చేసుకోవాలంటే 31 స్థానాల్లో గెలుపొందాల్సి ఉంటుంది. ఇక నేషనల్ పీపుల్స్ పార్టీ 8 స్థానాల్లో, కాంగ్రెస్ 3 చోట్ల ఆధిక్యంలో ఉన్నాయి.
#WATCH | Arunachal Pradesh: Counting of votes for Assembly elections underway; visuals from a counting centre in Yingkiong
The ruling BJP crossed the halfway mark; won 10 seats leading on 27. National People’s Party is leading on 8 seats, Nationalist Congress Party on 3 seats.… pic.twitter.com/z53MEaw4aI
— ANI (@ANI) June 2, 2024
ఇక సిక్కింలో ప్రజలు ఏకపక్ష తీర్పునిచ్చారు. అధికార సిక్కిం క్రాంతికారి మోర్చా (SKM) దెబ్బకు విపక్షాలు కకావికలమయ్యాయి. రాష్ట్రంలోని మొత్తం 32 స్థానాల్లో ఎస్కేఎం 28 చోట్ల ఆధిక్యంలో ఉన్నది.
#WATCH | Sikkim: Supporters and workers of Sikkim Democratic Front (SDF) gather at the Zila Panchayat office in Mangan district as the counting of votes is underway for the Sikkim Assembly elections
Ruling Sikkim Krantikari Morcha (SKM) crossed the halfway mark; leading on 28… pic.twitter.com/f70rfX48Zw
— ANI (@ANI) June 2, 2024