న్యూఢిల్లీ, జూన్ 28: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విదేశీ పర్యటనలపై అధికార బీజేపీ విమర్శలు గుప్పిస్తున్న వేళ దేశ రాజధాని ఢిల్లీలో ఆయన అదృశ్యం పోస్టర్లు వెలిశాయి. దీనిపై బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా స్పందిస్తూ ‘కన్పించకుండా పోయిన రాహుల్ బాబా, పర్యటన నాయకుడు’ అంటూ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని పనితీరును, రాహుల్ గాంధీ విదేశీ పర్యటనలను పోలుస్తూ విమర్శలు చేశారు.
అతి ముఖ్యమైన పార్లమెంటరీ సమావేశాలు, రాజకీయ సభలకు రాహుల్ గాంధీ తరచూ దూరంగా ఉంటారని అన్నారు. పార్టీకి, దేశానికి అవసరమైనప్పుడల్లా ఆయన విదేశీ పర్యటనల్లో ఉంటారన్నారు. ఆయనకు ప్రజలు కానీ, పార్లమెంట్ కానీ, పార్టీ కానీ ముఖ్యం కాదని, పర్యటనలే ఆయన తొలి ప్రాధాన్యత అని ఆరోపించారు. ఈ విదేశీ పర్యటనలకు డబ్బంతా ఎక్కడి నుంచి వస్తున్నదని ఆయన సందేహం వ్యక్తం చేశారు.