భువనేశ్వర్: ఒడిశాలోని అధికార బిజు జనతా దళ్ (బీజేడీ) ఇటీవల రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ నుంచి తీవ్ర నిరసనలు ఎదుర్కొంటున్నది. బీజేపీ, కాంగ్రెస్ నేతలు చేతులు కలిపి బీజేడీ నేతలపై వరుసగా కోడిగుడ్లతో దాడులకు పాల్పడుతున్నారు. ఇంధన ధరల పెరుగుదలకు నిరసనగా ఆదివారం కేంద్రపాడలో కేంద్ర మంత్రి బిశ్వేశ్వర్ తుడు కాన్వాయ్‌పై అధికార బీజేడీ విద్యార్థి విభాగం బిజూ ఛత్ర జనతాదళ్ కార్యకర్తలు కోడి గుడ్లు విసిరారు.
దీనికి ప్రతీకారంగా బుధవారం పూరీలో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కాన్వాయ్‌పై బీజేపీ కార్యకర్తలు గుడ్లు రువ్వారు. అలాగే గురువారం భువనేశ్వర్ సమీపంలో బీజేడీ ఎంపీ అపరాజితా సారంగిని కాన్వాయ్‌ను కాంగ్రెస్ కార్యకర్తలు లక్ష్యంగా చేసుకుని కోడిగుడ్లతో దాడి చేశారు. నిరుద్యోగం, ధరల పెరుగుదలపై ఈ మేరకు నిరసన తెలిపారు.
కాగా, ఎంపీ ప్రతినిధి దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అపరాజితా వాహనంపై రాళ్లు, కోడిగుడ్లతో దాడి చేశారని, కొందరు కత్తులు, ఇతర ఆయుధాలు కూడా కలిగి ఉన్నారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
MoS Home Captain Dibyashankar Mishra's resignation protest escalates , as Opposition now target's CM Naveen's carcade
— Suffian سفیان (@iamsuffian) November 24, 2021
🥚 Eggs hurled at #Odisha CM Naveen Patnaik's carcade in #Puri #MamitaMeher pic.twitter.com/z3G2hwRclp