Devendra Fadnavis | మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగా విజయం సాధించలేదని ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం- బీజేపీ సీనియర్ నేత దేవేంద్ర ఫడ్నవీస్ పేర్కొన్నారు. కానీ, అసెంబ్లీలో అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని ఓ టీవీ చానెల్ నిర్వహించిన సదస్సులో ఆయన చెప్పారు. క్షేత్ర స్థాయిలో వాస్తవ పరిస్థితుల ఆధారంగా ఆచరణాత్మకంగా వ్యవహరించాలని అన్నారు.
మహాయుతి పక్షాలు బీజేపీతోపాటు సీఎం ఏక్ నాథ్ షిండే సారధ్యంలోని శివసేన, డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ఆధ్వర్యంలోని ఎన్సీపీ ఎన్నికల్లో వజియం సాధిస్తాయని ఫడ్నవీస్ పేర్కొన్నారు. మూడు పార్టీలు సాధించే ఓట్లతో తప్పక విజయం సాధిస్తామని అని చెప్పారు. ఎన్నికల్లో టికెట్ ఆశించి భంగ పడి తిరుగుబాటు అభ్యర్థులుగా మారే పరిస్థితిపై ఫడ్నవీస్ స్పందిస్తూ.. కొందరు నేతలకు అవకాశం లభించక పోవడం కాస్త బాధగానే ఉందని చెప్పారు. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో 288 స్థానాలకు బీజేపీ 121 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది.