న్యూఢిల్లీ, ఆగస్టు 5 : బీజేపీ దాని అనుబంధ సంస్థలు నిత్యం గోవుల గురించి, వాటి రక్షణ గురించి మాట్లాడతాయే తప్ప వాటికి సరైన దాణా సమకూర్చడంతో, వాటికి వచ్చే వ్యాధుల నుంచి రక్షణకు ఎలాంటి చర్యలు తీసుకోవని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సయోని ఘోష్ విమర్శించారు. దేశంలోని 70 శాతం గ్రామీణ ప్రాంతాలు ఇదే రంగంపై ఆధారపడి జీవిస్తున్నా, దీనికి అతి తక్కువ మొత్తంలో నిధులు కేటాయిస్తున్నారని విమర్శించారు. కోళ్ల, పశువుల దాణా ధరలు రోజురోజుకూ ఆకాశాన్ని అంటుతున్నాయని అన్నారు.