న్యూఢిల్లీ: తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు కే అన్నామలై(K Annamalai) సమర్పించిన రాజీనామాను ఆ పార్టీ ఆమోదించింది. అయితే ఇవాళ పార్టీకి గుడ్‌బై చెప్పే అంశాన్ని అన్నామలై ప్రకటించనున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ ఆ రాజీనామాను అంగీకరించినట్లు అధికారిక ప్రకటన విడుదల చేశారు. అయితే భవిష్యత్తులో ఏం చేయాలనుకుంటున్నారో అన్నామలై, ఇవాళ మీడియాతో వెల్లడించనున్నారు. అన్నామలై రాజీనామాతో బీజేపీ ఓ సీనియర్ నేతను కోల్పోనున్నది. తమిళనాడుకు చెందిన మాజీ పోలీసు ఆఫీసర్ అన్నామలై.. 2020 ఆగస్టులో బీజేపీలో చేరారు. సింగం అన్న పేరు ఆయనకు ఉన్నది. ఐపీఎస్ పదవికి స్వచ్ఛంధ రాజీనామా చేసి రాజకీయాల్లో అడుగుపెట్టారు. ఆ తర్వాత శీఘ్ర దశలోనే ఆయన తమిళనాడు బీజేపీ అధ్యక్షుడయ్యారు.