భువనేశ్వర్: బీజేడీ నేత వీకే పాండియన్ సతీమణి సుజాత ఆర్ కార్తికేయన్పై ఎన్నికల కమిషన్ (ఈసీ) బదిలీ వేటు వేసింది. మిషన్ శక్తి డిపార్ట్మెంట్లో కమిషనర్ కమ్ సెక్రటరీగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆమెను.. రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శిగా బదిలీ చేసింది.
ప్రభుత్వ కార్యాలయాన్ని దుర్వినియోగం చేస్తున్నారని బీజేపీ ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఈసీ ఈ నిర్ణయం తీసుకున్నది. ప్రజలతో సంబంధం లేని శాఖకు ఆమెను బదిలీ చేసింది.