చెన్నై: చెన్నైలోని పలు ప్రాంతాల్లో వందలాది కాకులు మృతి చెందడంతో స్థానికంగా హెచ్5ఎన్1 వైరస్ (బర్డ్‌ఫ్లూ) వ్యాప్తిలో ఉందని ప్రభుత్వం నిర్ధారించింది. ఈ నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని.. మృత పక్షుల ఖననంలో జీవ భద్రతా ప్రమాణాలను పాటిస్తూ వాటిని పూడ్చటం లేదా కాల్చడం చేయాలని, చేతితో వాటిని తాకొద్దని అడ్వైజరీ జారీ చేసింది.
బర్డ్ ఫ్లూ వ్యాప్తిపై సమగ్ర సర్వే చేయాలని కేంద్ర ఆరోగ్య శాఖ తమిళనాడు చీఫ్ సెక్రటరీకి లేఖ రాసింది.