న్యూఢిల్లీ: డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులను ఇవాళ లోక్సభ(Lok Sabha)లో ప్రవేశపెట్టారు. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ మేఘవాల్.. 131వ రాజ్యాంగ సవరణ, డీలిమిటేషన్ బిల్లును ఆయన ప్రవేశపెట్టారు. ఇక కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా.. యూటీ చట్టాల సవరణ బిల్లును ప్రవేశపెట్టారు. కేంద్రం ప్రవేశపెట్టిన బిల్లులను విపక్షాలు వ్యతిరేకించాయి. కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్, సమాజ్వాదీ పార్టీ నేత ధర్మేంద్ర యాదవ్ సవరణల పట్ల తమ అభ్యంతరాలు వ్యక్తం చేశారు. రాజ్యాంగాన్ని ప్రభుత్వం హైజాక్ చేస్తున్నట్లు వేణుగోపాల్ ఆరోపించారు. అయితే బిల్లులను సభలో ప్రవేశపెట్టామని, దీనిపై చర్చ జరగాల్సి ఉందని కేంద్ర మంత్రులు రిజిజు, హోంశాఖ అన్నారు. అయితే లోక్సభ రూల్ 72 ప్రకారం తమ అభ్యంతరాలను వ్యక్తం చేయాలని స్పీకర్ ఓం బిర్లా తెలిపారు.
Law Minister Arjun Ram Meghwal proposes to introduce the Constitution (One Hundred and Thirty-First Amendment) Bill, 2026 in Lok Sabha
Union Home Minister proposes to introduce the Union Territories Laws (Amendment) Bill, 2026
Law Minister Arjun Ram Meghwal proposes to… pic.twitter.com/29GBJ9k7Nk
— ANI (@ANI) April 16, 2026