Harsh Goenka | ఇటలీకి చెందిన లగ్జరీ బ్రాండ్ ప్రాడా (Prada) ఇటీవలే ప్రదర్శించిన చెప్పులు, వాటి ధరలు ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారాయి. స్ప్రింగ్ సమ్మర్ 2026లో భాగంగా ప్రాడా పురుషులకు చెందిన పాదరక్షలను ఇటీవలే ప్రదర్శించింది. ఇవి అచ్చం భారత్‌లోని కొల్హాపురిలో తయారైన చెప్పులు (Kolhapuri chappals) లాగానే ఉన్నాయి. అయితే, వాటి ధర మాత్రం చర్చకు దారితీస్తోంది. సేమ్ డిజైన్‌తో అలాంటి చెప్పులు మన వద్ద రూ.400 వరకు ఉంటాయి. కానీ ప్రాడా మాత్రం ఆ చెప్పుల ధరను ఏకంగా రూ.1.2లక్షలుగా పేర్కొంది. ఈ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఏంటీ.. ఈ చెప్పులు అంత ఖరీదా అంటూ చర్చించుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో ఈ అంశంపై ప్రముఖ పారిశ్రామిక వేత్త హర్ష్ గోయెంక (Harsh Goenka) స్పందించారు. ప్రాడా ప్రదర్శించిన చెప్పుల ఫొటోలను ఎక్స్ ఖాతాలో పోస్టు చేస్తూ.. ఇవి భారతదేశపు ఐకానిక్ కొల్హాపురి చెప్పులను పోలి ఉన్నాయని పేర్కొన్నారు. కానీ వీటి ధర మాత్రం రూ. లక్షకు పైమాటే అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ‘ప్రాడా కొల్హాపురి చెప్పులను పోలిన ఉత్పత్తులను రూ.లక్షకు అమ్ముతోంది. వాటిని మన చేతి వృత్తుల వారు రూ.400కే తయారు చేస్తారు. అంటే వారు ఎంత నష్టపోతున్నారు..? గ్లోబల్ బ్రాండ్లు మన సంస్కృతిని సొమ్ము చేసుకుంటున్నాయి. ఎంత విచారకరం..!’ అంటూ గోయెంకా తన పోస్టులో రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. మహారాష్ట్రలోని కొల్హాపురి చేతివృత్తులకు ప్రసిద్ధి. అక్కడ తోలుతో తయారు చేసే చెప్పులు 12వ శతాబ్దానికి చెందినవి. 2019లో ఇవి భౌగోళికంగా గుర్తింపు పొందాయి.
Prada is selling products looking like Kolhapuri chappals for over ₹1 lakh. Our artisans make the same by hand for ₹400. They lose, while global brands cash in on our culture. Sad! pic.twitter.com/Cct4vOimKs
— Harsh Goenka (@hvgoenka) June 26, 2025
Also Read..
Watch: హైకోర్టు లైవ్ స్ట్రీమ్ విచారణకు టాయిలెట్ నుంచి హాజరైన వ్యక్తి.. వీడియో వైరల్
Kolkata | కోల్‌కతాలో మరో దారుణ ఘటన.. న్యాయ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం