Bilkis Bano | నిందితుల విడుదలను సవాల్ చేస్తూ.. ‘సుప్రీం’లో బిల్కిస్ బానో రివ్యూ పిటిషన్..!
Bilkis Bano Case | గోద్రా అల్లర్లలో తనపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన 11 మందిని దోషులను ముందస్తుగా విడుదల చేయడాన్ని సవాల్ చేస్తూ బిల్కిస్ బానో సుప్రీం కోర్టును ఆశ్రయించారు. నిందితుల విడుదలపై సర్వోన్నత న్యాయస్థానంలో బుధవారం రివ్యూ పిటిషన్
Bilkis Bano Case | 2002 గోద్రా అల్లర్లలో తనపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన 11 మందిని దోషులను ముందస్తుగా విడుదల చేయడాన్ని సవాల్ చేస్తూ బిల్కిస్ బానో సుప్రీం కోర్టును ఆశ్రయించారు. నిందితుల విడుదలపై సర్వోన్నత న్యాయస్థానంలో బుధవారం రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు. దోషులను విడుదల చేసేందుకు 1992 నాటి రెమిషన్ నిబంధనలను విర్తింపజేసేందుకు గుజరాత్ ప్రభుత్వానికి అనుమతి ఇస్తూ సుప్రీంకోర్టు 13న ఉత్తర్వులను పునః సమీక్షించాలని బిల్కిస్ బానో కోరారు.
బిల్కిస్ బానో తరఫు న్యాయవాది పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ దృష్టికి తీసుకెళ్లగా.. ఇంతకు ముందు దాఖలైన పిటిషన్‌తో కలిపి విచారించవచ్చా? ఒకే బెంచ్ ముందు విచారించవచ్చా? అనే అంశాన్ని పరిశీలిస్తామన్నారు. బిల్కిస్ బానో కేసులో ఇప్పటి వరకు సుప్రీంకోర్టులో రెండు పిటిషన్లు దాఖలయ్యాయి. ఇంతకు ముందు అక్టోబర్ 21న ‘నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఉమెన్’ దాఖలు చేసిన పిటిషన్‌పై కోర్టు ఇప్పటికే విచారణ జరుపుతున్నది. మహిళా సంస్థ తరఫున ఓ పిటిషన్ దాఖలైంది. ఈ కేసులో దోషులకు శిక్ష తగ్గించడాన్ని సవాల్ చేస్తూ పిటిషన్లు దాఖలయ్యాయి. 2002 గోద్రా అల్లర్ల సమయంలో బిల్కిన్ బానో వయసు 21 సంవత్సరాలు.
అప్పటికే ఐదు నెలల గర్భవతి కాగా.. అల్లర్ల సమయంలో పారిపోతున్న సమయంలో బిల్కిస్ బానోపై సామూహిక అత్యాచారం జరుగడంతో పాటు ఆమె కుటుంబంలోని ఏడుగురు హత్యకు గురయ్యారు. మృతుల్లో బిల్కిస్ బానో మూడేళ్ల కూతురు సైతం ఉన్నది. ఈ కేసులో 11 మంది నిందితులకు జీవితఖైదు ఖరారు కాగా.. ఈ ఏడాది ఆగస్టు 15న నిందితులను గుజరాత్ ప్రభుత్వం విడుదల చేసింది.అంతకు ముందు గోద్రా సబ్ జైలులో నిందితులు 15 సంవత్సరాలకుపైగా శిక్ష అనుభవించారు. అయితే, బిల్కిస్ బానో కేసు నిందితులను విడుదల చేయడంపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

