బెంగళూరు: ఖరీదైన కుక్క పిల్లతో ఒక మహిళ వాకింగ్ చేస్తున్నది. ఇంతలో ఇద్దరు వ్యక్తులు బైక్పై అక్కడకు వచ్చారు. కుక్క మెడకు ఉన్న పట్టీని పట్టుకుని లాక్కెళ్లారు. ఖరీదైన ఆ కుక్కను ఎత్తుకెళ్లారు. (Bike Borne Miscreants Snatch Dog) ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ సంఘటన జరిగింది. జయనగర్ ప్రాంతానికి చెందిన మధుర తన పెంపుడు కుక్క ‘రిచీ’తో కలిసి వాక్ చేస్తున్నది. ఇంతలో ఇద్దరు వ్యక్తులు బైక్పై అక్కడకు వచ్చారు. కుక్క మెడకు తగిలించి పట్టుకున్న పట్టీని ఆ మహిళ చేతి నుంచి లాక్కున్నారు. కుక్క పిల్లను రోడ్డుపై ఈడ్చి ఎత్తుకెళ్లారు.
కాగా, ఇది చూసి ఆ మహిళ షాక్ అయ్యింది. తన పెంపుడు కుక్క కోసం ఆ బైక్ వెంట కొంతదూరం పరుగెత్తింది. ఫలితం లేకపోవడంతో స్థానిక పోలీస్ స్టేషన్లో ఆమె ఫిర్యాదు చేసింది. చోరీకి గురైన పెంపుడు కుక్క విలువ రూ.10,000 ఉంటుందని పేర్కొంది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.