Bihar | పాట్నా: బీహార్లోని గయ జిల్లాలో ఉన్న బిహియాన్ గ్రామానికి గొప్ప చరిత్ర ఉంది. ఇక్కడి ప్రజలు ఆచరించే సాంస్కృతిక, ఆధ్యాత్మిక ఆచారాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. 300 సంవత్సరాల నుంచి ఈ గ్రామస్థులు శాకాహారులుగానే కొనసాగుతున్నారు. వీరు పూజించే బ్రహ్మ బాబా ఆగ్రహానికి గురికాకుండా ఉండాలంటే శాకాహార జీవన విధానాన్నే అవలంబించాలని వీరు విశ్వసిస్తున్నారు.
యువతరంతోపాటు ఈ గ్రామస్థులను పెండ్లి చేసుకునే యువతులు కూడా వీరి జీవన విధానాన్నే అనుసరిస్తూ, శాకాహారులుగానే మారుతున్నారు. మరోవైపు వీరు మద్యపానం, ఉల్లి, వెల్లుల్లికి కూడా దూరంగా ఉంటున్నారు. గ్రామం లో 400 కుటుంబాలు ఉన్నాయి.