Bihar People Clean Toilets | మారన్ వ్యాఖ్యలపై తేజస్వి యాదవ్ ఎలా స్పందించారంటే?
Bihar People Clean Toilets | హిందీ మాట్లాడే ఉత్తరప్రదేశ్, బీహార్ ప్రజలు తమిళనాడులో మరుగుదొడ్లను శుభ్రం చేస్తున్నారన్న (Bihar People Clean Toilets) డీఎంకే ఎంపీ దయానిధి మారన్ వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపాయి. ఈ నేపథ్యంలో ఆర్జేడీ నేత, బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ దీనిపై స్పందించారు.
పాట్నా: హిందీ మాట్లాడే ఉత్తరప్రదేశ్, బీహార్ ప్రజలు తమిళనాడులో మరుగుదొడ్లను శుభ్రం చేస్తున్నారన్న (Bihar People Clean Toilets) డీఎంకే ఎంపీ దయానిధి మారన్ వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపాయి. ఈ నేపథ్యంలో ఆర్జేడీ నేత, బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ దీనిపై స్పందించారు. మారన్ వ్యాఖ్యలను ఆయన ఖండించారు. ‘ఏ పార్టీకి చెందినప్పటికీ ఇతర రాష్ట్రాల నేతలు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మానుకోవాలి. దేశమంతా ఒక్కటే. ఇతర రాష్ట్రాల వారిని మేం గౌరవిస్తాం. ఇతర రాష్ట్రాల నుంచి అదే విధంగా ఆశిస్తాం. ఇలాంటి వ్యాఖ్యలు చేయకూడదు’ అని మీడియాతో అన్నారు.
కాగా, దయానిధి మారన్ మాట్లాడిన ఈ వీడియో క్లిప్ పాతదని డీఎంకే తెలిపింది. తమిళనాడుకు వరద సహాయం అందించడంలో కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ విఫలమయ్యారని విమర్శించింది. ఈ నేపథ్యంలో ఈ అంశం నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు ఈ పాత వీడియోను బీజేపీ తిరిగి ప్రచారం చేస్తోందని డీఎంకే వర్గాలు ఆరోపించాయి. మరోవైపు బీహార్ ప్రజల గురించి మారన్ చేసిన వ్యాఖ్యల వల్ల ప్రతిపక్షాల ‘ఇండియా’ కూటమి ఐకత్యకు ఇబ్బంది కలుగవచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
I.N.D.I Alliance leader and DMK MP Dayanidhi Maran says Hindi speakers from UP and Bihar come and clean toilets in TN.
Rahul Gandhi and Nitish Kumar must clarify, if this is the stated position of the Congress and JDU too.
I.N.D.I Alliance’s divisive agenda is out in full force… pic.twitter.com/i4wwLbYisW— Amit Malviya (@amitmalviya) December 24, 2023
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

