పాట్నా: బీహార్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకున్న ది. ఆర్జేడీ అధినేత లాలూ, మాజీ సీఎం రబ్రీదేవిలకు కల్పిస్తున్న జడ్ ప్లస్ క్యాటగిరి సెక్యూరిటీని రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉపసంహరించుకుంది. దీంతో ఆర్జేడీ కార్యకర్తలు పాట్నా సర్క్యూలర్ రోడ్లోని లాలూ నివాసం ముందు కర్రలు పట్టుకొని కాపలా కాస్తున్నారు.
ప్రభుత్వం పంపించిన స్పెషల్ ఆర్మ్డ్ ఫోర్స్ సిబ్బందిని లాలూ, రబ్రీదేవి శనివారం వెనక్కి పంపించేశారు. ప్రతిపక్ష నేత తేజస్వీ యాదవ్ కూడా తన వై-క్యాటగిరీ భద్రతను వెనక్కి పంపించారు.