అహ్మదాబాద్: ఒక యువకుడు నీట్ పోర్టల్‌ను చట్టవిరుద్ధంగా హ్యాక్ చేశాడు. అభ్యర్థుల బ్యాంకు ఖాతాలను యాక్సెస్ చేశాడు. వారి రిఫండ్ డబ్బును తన బ్యాంకు ఖాతాలోకి మళ్లించుకున్నాడు. (Youth hacks NEET Portal) దర్యాప్తు చేసిన సైబర్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఆ యువకుడిని అరెస్ట్ చేశారు. దేశ వ్యాప్తంగా వైద్య విద్యా సంస్థల్లో ప్రవేశాల కోసం మే 12న నిర్వహించిన నీట్ పరీక్షను పేపర్ లీక్ ఆరోపణల వల్ల రద్దు చేశారు. జూన్ 21న తిరిగి నిర్వహించనున్నారు.
కాగా, నీట్ రద్దు నేపథ్యంలో కొందరు అభ్యర్థులు తమ ఫీజును రీఫండ్ కోరారు. ఈ నేపథ్యంలో 19 ఏళ్ల యువకుడు నీట్ పోర్టల్‌ను హ్యాక్ చేశాడు. ఆ వైబ్‌సైట్ భద్రతా లోపాలను ఉపయోగించుకున్నాడు. సుమారు 350 మంది అభ్యర్థుల బ్యాంకు ఖాతాలను టార్గెట్ చేశాడు. ట్రయల్ అండ్ ఎర్రర్ పద్ధతి అయిన బ్రూట్-ఫోర్స్ ద్వారా 150 మంది అభ్యర్థుల పాస్వర్డ్లు, ఎన్క్రిప్షన్ కీ, పిన్‌లను ఛేదించాడు. ఆ విద్యార్థుల ప్రొఫైల్‌లకు అనుసంధానమైన బ్యాంకు ఖాతా వివరాలను తన బ్యాంకు ఖాతాలకు మార్చుకున్నాడు. ఒక్కో విద్యార్థికి రావలసిన రూ. 1,700 రీఫండ్‌ను తన సొంత ఖాతాలోకి జమ చేసుకున్నాడు.
మరోవైపు ఈ స్కామ్‌పై ఫిర్యాదు అందడంతో అహ్మదాబాద్ సైబర్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రీఫండ్ చెల్లింపులు పొందిన అభ్యర్థుల బ్యాంక్ ఖాతాల వివరాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నుంచి సేకరించారు. వాటిని పరిశీలించగా బీహార్‌లోని గయా జిల్లాకు చెందిన 19 ఏళ్ల నవీన్ యాదవ్ బ్యాంకు ఖాతాకు రీఫండ్ డబ్బులు మళ్లినట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో నిందితుడైన ఆ యువకుడిని అహ్మదాబాద్‌లో అరెస్ట్ చేసినట్లు పోలీస్ అధికారి తెలిపారు. ఈ రీఫండ్ స్కామ్‌పై మరింతగా దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.