పట్నా: బీహార్లో గత కొన్ని రోజులుగా ఎడతెరపి లేకుండా వర్షాలు పడుతున్నాయి. నదులు, వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. చాలాచోట్ల నదీతీరాల్లోని ప్రదేశాలు నీట మునిగాయి. బీహార్ రాజధాని పట్నాలోనూ వరదలు పోటెత్తాయి. నగరంలోని వివిధ ప్రాంతాల్లో శ్మశాన వాటికలు ( Cremation grounds ) నీట మునిగాయి. దాంతో మృతిచెందిన తమ ఆప్తులకు అంత్యక్రియలు కూడా సరిగా చేయలేకపోతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
శ్మశానాలు నీట మునగడంతో ఆ శ్మశానాలను అనుకుని ఉన్న మెయిన్ రోడ్లమీదనే మృతదేహాలకు దహన సంస్కారాలు నిర్వహిస్తున్నారు. మేం బలవంతంగా రోడ్లపై అంత్యక్రియలు నిర్వహించాల్సి వస్తున్నది. వరదల కారణంగా నగరంలోని చాలాచోట్ల శ్మశనాలు మునిగిపోయాయి అని రవికాంత్ కుమార్ అనే స్థానికుడు విచారం వ్యక్తంచేశాడు.