పట్నా : భార్యకు ప్రియుడితో వివాహం జరిపించడం సినిమాల్లో చూస్తుంటాం..అయితే రీల్ లైఫ్ ఘటన రియల్ లైఫ్‌లో జరిగింది. బిహార్‌లోని నవడ జిల్లాలో భార్యను తన ప్రియుడి చెంతకు చేర్చి అతడితో వివాహం జరిపించిన భర్త ఉదంతం వెలుగుచూసింది. భర్త సమక్షంలో లవర్స్ గ్రామంలోని శివాలయంలో జరిగిన పెండ్లి తంతుతో ఒక్కటయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
భార్యకు ప్రియుడితో వివాహం జరిపించడం సినిమాల్లో చూస్తుంటాం..అయితే రీల్ లైఫ్ ఘటన రియల్ లైఫ్‌లో జరిగింది. బిహార్‌లోని నవడ జిల్లాలో భార్యను తన ప్రియుడి చెంతకు చేర్చి అతడితో వివాహం జరిపించిన భర్త ఉదంతం వెలుగుచూసింది. pic.twitter.com/SdQYFN4xWI
— Namasthe Telangana (@ntdailyonline) July 7, 2023
ఈ వీడియోలో మహిళ నుదుటిన ఆమె బాయ్‌ఫ్రెండ్ తిలకం దిద్దుతుండగా అక్కడ చేరిన వారు ఈ దృశ్యాన్ని మొబైల్ ఫోన్లలో రికార్డు చేశారు. బాయ్‌ఫ్రెండ్ ఆమెకు బొట్టుపెడుతుండగా మహిళ ఏడుస్తుండటం చూడొచ్చు. భర్త పని నిమిత్తం బయటకు వెళ్లగా మహిళ రాత్రివేళ బాయ్‌ఫ్రెండ్‌ను కలుసుకునేందుకు వెళ్లగా వారిద్దరూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడటంతో వివాహేతర బంధం బయటపడింది.
Biharrrr
కుటుంబసభ్యులు వారిని తీవ్రంగా కొట్టి నిర్బంధించారు. వారిద్దరినీ గ్రామం విడిచివెళ్లాలని గ్రామస్తులు పట్టుబట్టారు. పని నుంచి తిరిగివచ్చిన మహిళ భర్త విషయం తెలుసుకుని ఆపై వారిద్దరినీ గ్రామంలోని ఆలయానికి తీసుకువెళ్లాడు. ఆలయంలో తన భార్యతో ఆమె ప్రియుడికి వివాహం జరిపించాడు. ఇక ఈ విషయం గురించి తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు పేర్కొన్నారు.
Read More :