పట్నా: కరోనా వైరస్ విస్తృతిని కట్టడి చేయడం కోసం బీహార్ ప్రభుత్వం విధించిన లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించాడంటూ ఇవాళ పట్నా పోలీసులు జన్ అధికార్ పార్టీ అధ్యక్షుడు పప్పూ యాదవ్‌ను అరెస్ట్ చేశారు. పప్పూయాదవ్ లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించాడని, అనుమతి లేకుండా కారులో రోడ్లపై తిరుగుతున్నందుకే అయనను అరెస్ట్ చేశామని పట్నా డీఎస్పీ తెలిపారు. చట్ట ప్రకారం ఆయనపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.
కాగా, అరెస్ట్ విషయమై పప్పూయాదవ్‌ను మీడియా పలుకరించగా.. గత నెలన్నర రోజులుగా తాను ఇంటింటికి వెళ్లి నిత్యాసరాలు అందజేస్తున్నానని, అందులో భాగంగానే ఇవాళ కూడా బయటికి వస్తే అరెస్ట్ చేశారని తెలిపాడు. కష్టకాలంలో ప్రజలకు సేవ చేసే వాళ్లను అరెస్ట్ చేయించడం వెనుక ఉద్దేశం ఏమిటో బీహార్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి నితీశ్బాబుకే తెలియాలి అని వెటకారంగా అన్నారు.
Bihar: Jan Adhikar Party chief Pappu Yadav arrested by Police in Patna. DSP Town, Suresh Prasad says, "He has been arrested for violation of lockdown. He was moving around in a vehicle without a permit. Legal action is being taken." pic.twitter.com/M3CRATeWZq
— ANI (@ANI) May 11, 2021