Bihar Gangster | బీహార్ రాష్ట్రంలో పేరుమోసిన గ్యాంగ్ స్టర్ సరోజ్ రాయ్.. శుక్రవారం హర్యానాలో జరిగిన ఎన్ కౌంటర్ లో మరణించాడని పోలీసు అధికారులు తెలిపారు. అతని తలపై రూ.2 లక్షల రివార్డు ఉంది. గుర్‌గ్రామ్‌లో హర్యానా పోలీసులు, బీహార్ పోలీస్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ (ఎస్టీఎఫ్) పోలీసులు నిర్వహించిన జాయింట్ ఆపరేషన్‌లో సరోజ్ రాయ్ మరణించాడు. ఈ ఎన్ కౌంటర్ లో ఎస్టీఎఫ్ కానిస్టేబుల్ గాయ పడ్డాడు. ఆయనకు గుర్ గ్రామ్ లోని దవాఖానలో చికిత్స అందిస్తున్నట్లు డీజీపీ జేఎస్ గాంగ్వార్ తెలిపారు. ఈ గ్యాంగ్ స్టర్ 33 క్రిమినల్ కేసుల్లో వాంటెడ్ గా ఉన్నాడు. సరోజ్ రాయ్ కి, పోలీసులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో మరణించాడు. అతడిపై జార్ఖండ్ పోలీసులు పలు కేసులు నమోదు చేశారు.