Bihar elections : బీహార్ (Bihar) అసెంబ్లీ ఎన్నికల (Assembly elections) లో మహాగఠ్బంధన్ (Mahaghatbandan) ఘోర పరాజయం పాలైంది. అందులోనూ కాంగ్రెస్ పార్టీ (Congress party) దారుణాతిదారుణమైన ఫలితాలను చవిచూసింది. ఈ నేపథ్యంలో బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ పార్టీ ఆత్మవిమర్శ చేసుకోవాలని ఆ పార్టీ సీనియర్ నేత, ఎంపీ శశిథరూర్ (MP Shashi Tharoor) అభిప్రాయపడ్డారు.
అదేవిధంగా బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఎందుకు పాల్గొనలేదన్న ప్రశ్నకు స్పందిస్తూ.. ఎన్నికల ప్రచారానికి పార్టీ తనను ఆహ్వానించలేదని, అందుకే ప్రచారంలో పాల్గొనలేదని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ తన ఓటమికిగల కారణాలను విశ్లేషించుకొని, లోపాలు ఎక్కడున్నాయో గమనించాలని సూచించారు. ఎన్డీయే కూటమి భారీ ఆధిక్యం సాధించినందున అందుకు గల కారణాలను క్షుణ్ణంగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇలాంటి విషయాల్లో మొత్తం కూటమి పనితీరును పరిశీలించడం చాలా ముఖ్యమని పేర్కొన్నారు.