న్యూఢిల్లీ3: ఉద్యోగానికి భూమి కుంభకోణంలో బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్, ఆయన తండ్రి, మాజీ రైల్వే మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్, తల్లి, మాజీ సీఎం రబ్రీ దేవికి సంబంధం ఉందని పేర్కొంటూ సీబీఐ సోమవారం రెండో చార్జిషీట్‌ను సీబీఐ ప్రత్యేక కోర్టులో దాఖలు చేసింది.
ఇందులో ఏకే ఇన్ఫో సిస్టమ్‌తో పాటు కొందరు మధ్యవర్తుల పేర్లను కూడా చేర్చింది. కుంభకోణంలో నిందితుల పాత్రపై మొదటి చార్జిషీట్లో సమర్పించని వివరాలను తాజా చార్జిషీట్లో పొందుపరిచారు.