బీహార్ తదుపరి సీఎం ఎవరు?.. ఎమ్మెల్సీ పదవికి నితీశ్ రాజీనామా
బీహార్ సీఎం నితీశ్ కుమార్ సోమవారం తన శాసన మండలి సభ్యత్వానికి రాజీనామా చేశారు. దీంతో తదుపరి బీహార్ సీఎం ఎవరవుతారనే దానిపై చర్చ ఊపందుకొన్నది.
పాట్నా: బీహార్ సీఎం నితీశ్ కుమార్ సోమవారం తన శాసన మండలి సభ్యత్వానికి రాజీనామా చేశారు. దీంతో తదుపరి బీహార్ సీఎం ఎవరవుతారనే దానిపై చర్చ ఊపందుకొన్నది. జేడీయూలోని విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం సీఎం పదవికి ఎనిమిది మంది నాయకులు పోటీ పడుతున్నట్టు తెలిసింది. సామ్రాట్
చౌదరి: ప్రస్తుతం ఉపముఖ్యమంత్రిగా ఉన్నారు. తారాపూర్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు.
నిత్యానందరాయ్: ప్రస్తుతం కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా వ్యవహరిస్తున్నారు.
విజయ్‌కుమార్ సిన్హా: ఈయన కూడా ఉపముఖ్యమంత్రిగా ఉన్నారు.
సంజీవ్ చౌసారియా: దిఘా నియోజకవర్గ ఎమ్మెల్యే. 2025 అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఐ ఎంఎల్ అభ్యర్థి దివ్యా గౌతమ్‌పై 59 వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.
నితీశ్ మిశ్రా: మధుబని జిల్లాలోని ఝన్ఝర్పూర్ స్థానం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో 52 వేల ఓట్లకుపైగా మెజారిటీతో విజయం సాధించారు.
దిలీప్ జైస్వాల్: బీహార్ బీజేపీ మాజీ అధ్యక్షుడు. బీహార్ శాసనమండలికి మూడోసారి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2014లో కిషన్‌గంజ్ నుంచి లోక్‌సభకు పోటీచేశారు.
రామ్‌కృపాల్ యాదవ్: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి. గతంలో పాటలీపుత్ర స్థానం నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు.
జనక్ రామ్: ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశారు. కిషన్‌గంజ్ నుంచి గతంలో లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kethireddy Vasudeva reddy | దొర అహంకారంతో వ్యవహరిస్తున్న బల్మూరి వెంకట్ : డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి
పర్సాయపల్లిలో బతుకమ్మ విగ్రహానికి కొత్త శోభ
‘పట్టభద్రులు ఓటు హక్కు నమోదు చేసుకోవాలి’
‘అర్హులైన మహిళలందరికీ బతుకమ్మ చీరలు ఇవ్వాలి’
Congress councilors resign | మంత్రి జూపల్లి, ఎంపీ మల్లు రవి పోకడలకు నిరసనగా ఏడుగురు కాంగ్రెస్ కౌన్సిలర్ల రాజీనామా
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

