న్యూఢిల్లీ: బీహార్ సీఎం నితీశ్ కుమార్(CM Nitish Kumar) ఇవాళ ఢిల్లీలో ప్రధాని మోదీని కలిశారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు మంగళవారం వెలుబడనున్న నేపథ్యంలో ఆ ఇద్దరి భేటీ కీలకంగా మారింది. అయితే ఈ భేటీ గురించి ఎటువంటి అధికారిక సమాచారం బయటకు రాలేదు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏలోనే నితీశ్‌కు చెందిన జేడీయూ ఉన్నది. అయితే బీహార్‌లో ఆర్జేడీ నుంచి గట్టి పోటీ వస్తున్న నేపథ్యంలో జేడీయూ కొంత బలహీనమైనట్లు తెలుస్తోంది. 2005 నుంచి నితీశ్ కుమార్ .. దాదాపు బీహార్ సీఎం బాధ్యతల్లోనే కొనసాగారు. అయితే బీజేపీ, ఆర్జేడీ .. బీహార్‌లో ప్రధాన పార్టీలుగా ఎదగడంతో.. జేడీయూ భవిష్యత్తుపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తాజాగా ముగిసిన లోక్‌సభ ఎన్నికల్లో జేడీయూకు 11 సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నట్లు ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి.