న్యూఢిల్లీ, అక్టోబర్ 18: బీహార్ అసెంబ్లీ ఎన్నికల తేదీలు ముంచుకొస్తున్నప్పటికీ విపక్ష కూటమిలో సీట్ల పంచాయితీ ఎంతకీ ఓ కొలిక్కి రావడం లేదు. విపక్ష కూటమిలో భాగస్వామ్య పక్షాలైన ఆర్జేడీ, కాంగ్రెస్ అభ్యర్థులు ఉభయులూ కొన్ని సీట్లలో నామినేషన్లు వేసేందుకు సిద్ధమవుతుండగా అనేక స్థానాలలో స్నేహపూర్వక పోటీ అనివార్యంగా కనిపిస్తోంది.
స్నేహపూర్వక పోటీకి ఇష్టపడని కాంగ్రెస్ విపక్షాల నుంచి సీఎం అభ్యర్థిగా ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ పేరును ఇప్పుడే బహిరంగంగా ప్రకటించవద్దని కాంగ్రెస్ అగ్రనాయకత్వం తన శ్రేణులను ఆదేశించడం బ్లాక్మెయిలింగ్గా ఆర్జేడీ అనుమానిస్తోంది.