సోమవారం 01 జూన్ 2020
National - May 08, 2020 , 14:37:42

వ‌ల‌స‌కూలీలు తిరిగిరావ‌డంపై సందిగ్ధంలో బీహార్ ప్ర‌భుత్వం

వ‌ల‌స‌కూలీలు తిరిగిరావ‌డంపై సందిగ్ధంలో బీహార్ ప్ర‌భుత్వం

బీహార్‌: వ‌ల‌స కూలీలు స్వ‌రాష్ట్రంకు తిరిగి రావ‌డం ప్రారంభ‌మైంది. దీంతో బీహార్ ప్ర‌భుత్వంలో సందిగ్ధ‌త నెల‌కొంది. కోవిడ్‌-19 కార‌ణంగా లాక్‌డౌన్ విధించ‌డంతో ప‌నులు లేక వేలాది మంది నిరాశ‌కు గురై స్వ‌రాష్ట్రాల బాట‌ప‌ట్టారు. త‌మ‌ను తిరిగి స్వంత రాష్ట్రానికి పంపాల‌ని బీహారీలు ఆయా రాష్ట్రాల కార్యాల‌యాల వ‌ద్ద వేలాది మంది క్యూ క‌డుతున్నారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో పాలుపంచుకున్న శ్రామికుల‌ను ఇక్క‌డే ఉండిపోవాల‌ని, వారికి మంచి వేత‌నం క‌ల్పిస్తామ‌ని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. సీఎం పిలుపు మేర‌కు బిహార్ రాష్ట్రానికి చెందిన ఖ‌లేరియా జిల్లా వాసులు 222 మంది వ‌ల‌స కూలీలు తెలంగాణ‌లో ప‌లు రైస్ మిల్లుల్లో ప‌నుల‌కు కుదిరారు. ఇంకా చాలా మంది కూలీలు తెలంగాణ‌లోనే ప‌ని కల్పిస్తే ఉండిపోవ‌డానికి సిద్ధ‌ప‌డుతున్నారు.

 అభివృద్ధి చెందిన రాష్ట్రాలు మా రాష్ట్ర శ్ర‌మ‌శ‌క్తిని గ్ర‌హించింద‌ని బీహార్ డిప్యూటీ సీఎం సుశీల్‌కుమార్ మోడీ అన్నారు. ఇప్ప‌టికే మ‌హారాష్ట్ర‌, పంజాబ్‌, గుజ‌రాత్‌, క‌ర్ణాట‌క రాష్ట్రాల్లో నిర్మాణ ప‌నులు పెద్ద ఎత్తున ప్రారంభ‌మ‌య్యాయి. దీంతో స్వ‌స్థ‌లాల‌కు వ‌స్తామ‌నుకున్న కూలీలు అక్క‌డే ఉండిపోయార‌ని పేర్కొన్నారు. ప్ర‌స్తుతానికి నితీశ్‌కుమార్ ప్ర‌భుత్వం స్వ‌స్థ‌లాల‌కు వ‌చ్చే కూలీల‌కు వారి ఇంటి స‌మీపంలో పనులు క‌ల్పించాల‌ని ఇప్ప‌టికే అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. త‌క్క‌వ ప‌రిశ్ర‌మ‌లు, ఉపాధి అవ‌కాశాలు లేని రాష్ట్రంలో కార్మికుల‌కు ప‌నుల‌ను క‌ల్పించ‌డం క‌ష్ట‌మ‌ని అధికారులు తెలిపారు. వ‌ల‌స కూలీలు స్వ‌రాష్ట్రానికి వ‌చ్చే బ‌దులు వారు ప‌నులు చేసుకునే ప్ర‌దేశంలోనే ఉండిపోవాల‌ని కోరుతున్నారు. 


logo