హరియాణలో మళ్లీ రాజకీయ అస్ధిరతకు తెరలేచే పరిస్ధితి నెలకొంది. హరియాణ మాజీ సీఎం, కాంగ్రెస్ నేత భూపీందర్ సింగ్ హుడా రాష్ట్ర గవర్నర్తో గురువారం భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. పంజాబ్ అసెంబ్లీ రద్దు చేయాలని తాము రాష్ట్ర గవర్నర్ను కోరామని భూపీందర్ హుడా మీడియాతో మాట్లాడుతూ పేర్కొన్నారు.
సంఖ్యాబలం లేని సైనీ నేతృత్వంలోని కాషాయ సర్కార్ అధికారంలో కొనసాగే నైతిక హక్కు కోల్పోయిందని అన్నారు. వారు మెజారిటీని నిరూపించుకోవాలని కోరుకుంటే తమకు మద్దతిచ్చే ఎమ్మెల్యేలను వారు గవర్నర్ ముందు హాజరుపరచాలని చెప్పారు.
ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేసి తమవైపునకు తిప్పుకునే చర్యలను పాలక పక్షం నిలిపివేయాలని డిమాండ్ చేశారు. నైతికంగా ఈ ప్రభుత్వం కొనసాగే హక్కును కోల్పోవడంతో ప్రభుత్వం తక్షణమే తప్పుకోవాలని, మళ్లీ ఎన్నికలకు వెళ్లాలని భూపీందర్ సింగ్ హుడా వ్యాఖ్యానించారు.
Read More :
Telangana | ఇందిరా పార్క్ వద్ద నిరుద్యోగుల మహా ధర్నా.. గ్రూప్-2, 3 పోస్టులు పెంచాలని డిమాండ్