Telangana | ఇందిరా పార్క్ వద్ద నిరుద్యోగుల మహా ధర్నా.. గ్రూప్-2, 3 పోస్టులు పెంచాలని డిమాండ్
Telangana | రాష్ట్రంలోని నిరుద్యోగులు ధర్నాల బాట పట్టారు. గ్రూప్-1 మెయిన్స్‌కు 1:100 పిలవాలని, గ్రూప్-2, గ్రూప్-3 పోస్టులు పెంచాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తూ ధర్నాకు దిగారు. ఇందిరా పార్కు వద్ద చేపట్టిన ఈ ధర్నాకు పలు పార్టీలకు చెందిన రాజకీయ నాయకులు మద్దతు తెలిపారు.
Telangana | హైదరాబాద్ : రాష్ట్రంలోని నిరుద్యోగులు ధర్నాల బాట పట్టారు. గ్రూప్-1 మెయిన్స్‌కు 1:100 పిలవాలని, గ్రూప్-2, గ్రూప్-3 పోస్టులు పెంచాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తూ ధర్నాకు దిగారు. ఇందిరా పార్కు వద్ద చేపట్టిన ఈ ధర్నాకు పలు పార్టీలకు చెందిన రాజకీయ నాయకులు మద్దతు తెలిపారు.
గ్రూప్-2లో 2 వేల పోస్టులు, గ్రూప్ -3లో 3 వేల పోస్టులకు పెంచాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. దీంతో పాటు మెగా డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. గ్రూప్-2, 3 రాతపరీక్షలను డిసెంబర్ వరకు వాయిదా వేయాలన్నారు. ఇక జీవో 46ను రద్దు చేయాలన్నారు.
ధర్నాకు హాజరైన సింధూజ(నల్లగొండ) మాట్లాడుతూ.. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించి, వారి డిమాండ్లను నెరవేరుస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు నిరుద్యోగులను కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మరో నిరుద్యోగ అభ్యర్థి ఈశ్వర్ మాట్లాడుతూ.. ఎమ్మెల్సీలు బల్మూర్ వెంకట్, చింతపండు నవీన్ కుమార్ ఇద్దరు ఎన్నికల సమయంలో నిరుద్యోగులకు ఎన్నో హామీలిచ్చారు. ఇప్పుడు ఎమ్మెల్సీలు అయ్యాక నిరుద్యోగుల బాధలను పట్టించుకోవడం లేదని వాపోయారు. నిరుద్యోగుల సమస్యలపై వారిద్దరూ స్పందించడం లేదని, కాంగ్రెస్ ప్రభుత్వానికి వంత పాడుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్ హయాంలో జారీ చేసిన 30 వేల ఉద్యోగాలకు రేవంత్ నియామక పత్రాలిచ్చి తానే భర్తీ చేసినట్లు మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడు నెలలు అవుతున్నా, ఇప్పటి వరకు ఒక్క కొత్త నోటిఫికేషన్ రాలేదన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

